Home > తెలంగాణ > నుమాయిష్ 2024 ప్రారంభించిన సీఎం రేవంత్

నుమాయిష్ 2024 ప్రారంభించిన సీఎం రేవంత్

నుమాయిష్ 2024 ప్రారంభించిన సీఎం రేవంత్
X

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న నుమాయిన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌ అంటేనే చార్మినార్‌, ట్యాంక్‌ బండ్‌, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గుర్తొస్తాయని అన్నారు. నుమాయిష్‌లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని.. ఎన్నో రకాల వస్తువులు సైతం ఇక్కడ అమ్ముతారని అన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎగ్జిబిషన్‌ కమిటీలో మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రశంసించిన సీఎం రేవంత్.. పారిశ్రామిక రంగంలో వారిని మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

మరోవైపు ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు కలిసి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నుమాయిష్‌ నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌ను ఎంచుకున్నారని, రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు.

ఈసారి నుమాయిష్‌ లో 2,400 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సందర్శకులు మాస్కులు కచ్చితంగా ధరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. నుమాయిష్‌ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులు పొడగించాలని హైదరాబాద్‌ మెట్రో నిర్ణయించింది.

Updated : 1 Jan 2024 6:56 PM IST
Tags:    
Next Story
Share it
Top