Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
X
రాష్ట్రం ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాది కొత్తగుడెం జిల్లా భద్రాచలంలోని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన సీఎం బడుగు బలహీనవర్గాల ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని అభివర్ణించారు.పేదలు కష్టాలు చూసిన ఇందిరాగాంధీ ఆనాడు ఈ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.పేదలు సమాజంలో గౌరవంగా బతకలని ఉద్దేశ్యంతో ఇళ్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు.ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది.ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22 వేల కోట్లు నిధులు కేటాయించాం అని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. దశలవారీగా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.సొంత ఇంటి స్థలంలో ఇళ్లు కట్టుకునే వారి కోసం పలు రకాల డిజైన్లను ప్రభుత్వమే తయారు చేయించింది. ఈ నమూనాలో ఒక వంట గది, టాయిలెట్ తప్పనిసరిగా ఉంటాయి. ఇంటి డిజైన్లను సీఎం రేవంత్ సోమవారం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్లను నిర్మించేందుకు 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.7740 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.