Revanth Reddy : రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
X
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్ భవన్‌లో కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయనకు సీఎం వీణను బహూకరించారు. కాగా కోవింద్ జమిలీ ఎన్నికల కమిటీ చైర్మన్గా ఉన్నారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఇందులో భాగంగానే కోవింద్ హైదరాబాద్ వచ్చారు.
సెప్టెంబర్ 23న జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ జరిగింది. ఆ సమావేశంలో జమిలి ఎన్నికలపై అభిప్రాయాల సేకరించడంతో పాటు రాజకీయపార్టీల సూచనలు స్వీకరించాలని డిసైడ్ అయింది. మరోవైపు ఈ సారి జమిలి ఎన్నికలు సాధ్యం కావని లా కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ప్రస్తుత అధికరణలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించలేరని చెప్పినట్లు సమాచారం. ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951లో సంబంధిత ప్రొవిజన్లను సవరించాలని లా కమిషన్ సిఫారసు చేసినట్లు సమాచారం.