Home > తెలంగాణ > ప్రధాని మోడీతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. గంటన్నర పాటు సాగిన చర్చ

ప్రధాని మోడీతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. గంటన్నర పాటు సాగిన చర్చ

ప్రధాని మోడీతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. గంటన్నర పాటు సాగిన చర్చ
X

ప్రధాని నరేంద్రమోడీ, సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పాల్గొన్న ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై వారిరువురూ ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీని కలవడం ఇదే మొదటిసారి.

భేటీలో ప్రధాని, సీఎంల మధ్య రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల మంజూరు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.


Updated : 26 Dec 2023 6:21 PM IST
Tags:    
Next Story
Share it
Top