Home > తెలంగాణ > ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్.. అమిత్ షాతో భేటీ..

ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్.. అమిత్ షాతో భేటీ..

ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్.. అమిత్ షాతో భేటీ..
X

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్లతో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణకు ఐపీఎస్లను పెంచాలని హోంమంత్రిని రేవంత్ కోరారు. అదేవిధంగా విభజన సమస్యలపైనా చర్చించారు. షెకావత్తో సమావేశంలో మంత్రి ఉత్తమ్ సైతం పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని షెకావత్కు వినతిపత్రం అందజేశారు.

అంతకుముందు ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. కాగా కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీపై హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నారు. నామినేటెడ్ పోస్టులు పార్లమెంట్ ఎన్నికల తర్వాతే అని ప్రచారం జరిగినా.. ఈ నెల్లోనే వాటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న సీఎం రేవంత్ దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోగా పదవులను భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ పటిష్ఠత, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చేలా జాబితా రూపొందించినట్లు సమాచారం. ఈ జాబితాలపై అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Updated : 4 Jan 2024 7:42 PM IST
Tags:    
Next Story
Share it
Top