CM Revanth on free current: 24 గంటల కరెంట్పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X
24 గంటల కరెంట్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరైన విధానం లేకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తులున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో ఎక్కువ ధర చెల్లించడానికి గల కారణాలు తెలపాలని అధికారులను కోరారు. తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీల నుంచి కరెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. బుధవారం (జనవరి 10) సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో రేవంత్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, నివేదికలను ఇవ్వాలని సీఎం ఆదేశించారు.