రీజినల్ రింగ్ రోడ్డు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X
రీజినల్ రింగ్ రోడ్డుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్ఆర్‌ఆర్ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూ సేకరణతో పాటు ఉత్తర భాగంలో పనులకు టెండర్లు పిలవాలని సూచించారు. అదేవిధంగా ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని ఎన్‌హెచ్‌గా ప్రకటించాలని ఎన్‌హెచ్‌ఏఐని సీఎం కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వివిధ దేశాల వ్యాపారస్థులతో సమావేశమవుతోన్నారు. తెలంగాణలో పెట్టబడులు పెట్టాలని వారిని కోరుతున్నా ఇప్పటికే WEF ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను ఆయనకు వివరించారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో ఆయన మాట్లాడతారని తెలిపారు. చర్చాగోష్ఠిలో వైద్యరంగంపై తన అభిప్రాయాలను రేవంత్ రెడ్డి పంచుకుంటారని వెల్లడించారు.