Home > తెలంగాణ > హస్పిటల్లో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హస్పిటల్లో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హస్పిటల్లో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో ఆయనకు సాయంత్రం శస్త్ర చికిత్స జరగనుంది. ఈ క్రమంలో కేసీఆర్ అనారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. యశోద ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హాస్పిటల్ వద్ద సెక్యూరిటీ పెంచారు. గురువారం అర్ధరాత్రి ఫాంహౌజ్‌లో కాలు జారి కిందపడటంతో కేసీఆర్ తుంటికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు ఆపరేషన్కు సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేసీఆర్ను పరామర్శించేందుకు పలువురు నేతలు యశోదకు క్యూ కట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. వారంతా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Updated : 8 Dec 2023 11:46 AM IST
Tags:    
Next Story
Share it
Top