మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం: CM Revanth Reddy
X
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రస్తుతం రెండు అమలువుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు పథకాలు అమలవుతున్నాయి. ఫిబ్రవరి 2న మరో రెండు గ్యారంటీలు అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి 2 గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
గురువారం 6 గ్యారంటీలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై చర్చ జరిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలో మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు తెలిపారు. సిలిండర్, విద్యుత్, ఇళ్ల గ్యారంటీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. బడ్జెట్ నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.