Home > తెలంగాణ > మహిళా సంఘాలకు సర్కారు స్కూళ్ల బాధ్యత

మహిళా సంఘాలకు సర్కారు స్కూళ్ల బాధ్యత

మహిళా సంఘాలకు సర్కారు స్కూళ్ల బాధ్యత
X

కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు స్కూళ్లపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల యూనిఫాంలు, మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షన బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ నిర్ణయం వల్ల స్కూళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు.. మహిళలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చినట్లవుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు కరెంట్ సరఫరా అయ్యేలా చూడాలని, సోలార్ ప్యానెల్లపై దృష్టి సారించాలని చెప్పారు.

అన్ని మౌలిక వసతులు కల్పించాలని, స్పష్టమైన మార్పు తీసుకురావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని, టీశాట్ ద్వారా డిజిటల్ క్లాసులు చెప్పాలని అన్నారు. స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ముగిసేలోగా పనులు పూర్తిచేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పద్దతులను పరిశీలించి ఇక్కడ కూడా తీసుకురావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకెషన్ పాలసీపై సమగ్ర అధ్యయనం చేయాలని అన్నారు.

Updated : 11 March 2024 5:22 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top