ఆర్థిక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
X
ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. 2024 - 25 వార్షిక బడ్జెట్.. వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించాలని చెప్పారు. ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు. తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలన్న సీఎం.. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్ రూపకల్పన జరగాలని స్పష్టం చేశారు.
అప్పులు దాచి.. ఆదాయాన్ని పెద్దగా చేసి చూపొద్దని రేవంత్ సూచించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కేంద్రానికి పేరు వస్తుందనే బేషజాలకు పోవద్దన్నారు. కొత్త వాహనాలు కొనకుండా ఉన్న వాటినే వాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం శాంతి కుమారి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.