Home > తెలంగాణ > మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తం: సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తం: సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తం: సీఎం రేవంత్ రెడ్డి
X

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో సిట్టింగ్‌ జడ్జితో తప్పక విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ శాసన మండలిలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిందో.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామని అన్నారు. ఈ విషయంలో సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపి, అన్ని విషయాలు బయటికి తీసుకొస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు ఎవరిచ్చారు? వారి వెనుకున్న మంత్రులెవరు? అధికారుల పాత్ర సహా అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. స్వేచ్చ కోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడామని, అయితే అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. ఉమ్మడి రాష్ట్రంలోలా పరిపాలన చేసిందని మండిపడ్డారు.

ఉక్కు కంచెలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు దూరమయ్యారని, ప్రగతి భవన్‌ ఉక్కు కంచెలు బద్ధలు కొట్టి.. ఆ పాలనలో చేసిన తప్పుల్ని సరిదిద్దామని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ప్రజల స్వేచ్ఛను ఏడో హామీగా ఇచ్చామని చెప్పారు. కానీ కొందరు నేతలు బానిసత్వాన్ని వదులుకోవడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో పేదలకందని ఆరోగ్య శ్రీ హామీని అందేలా చేస్తామని చెప్పారు. పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. మురికి మూసీని ప్రక్షాళన చేసి జీవనదిగా మారుస్తామని రేవంత్ భరోసానిన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రభుత్వానికి ఎవరైనా.. ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చని చెప్పారు.

Updated : 16 Dec 2023 9:00 PM IST
Tags:    
Next Story
Share it
Top