Home > తెలంగాణ > MCRHRD ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీస్‌: రేవంత్‌రెడ్డి

MCRHRD ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీస్‌: రేవంత్‌రెడ్డి

MCRHRD ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీస్‌: రేవంత్‌రెడ్డి
X

తెలంగాణ సీఎంగా బాధ్యతు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. MCRHRDలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుని, సీఎం క్యాంపు ఆఫీస్‌ నిర్మిస్తామని చెప్పారు. కొత్తగా ఎలాంటి ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై అందరితో చర్చించి శ్వేత పత్రం విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ పై మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 నుంచి 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. రేపు (డిసెంబర్ 15) జరగబోయే బీఏసీ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామపి చెప్పారు.

అనంతరం హైదరాబాద్ మెట్రో విస్తరనపై మాట్లాడిన సీఎం.. రాయదుర్గం - ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఎయిర్ పోర్ట్ కు ఇప్పటికే మంచి రవాణా సదుపాయం ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో విమానాశ్రయానికి మరో కొత్త మార్గంలో మెట్రోను ప్లాన్‌ చేస్తామని స్పష్టం చేశారు. దాని బదులు ఎంజీబీఎస్, ఫలక్ నుమా, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట నుంచి మెట్రో అలైన్మెంట్ ఇస్తే సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఎల్ అండ్ టీ మెట్రో, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ రాయితీ ఒప్పందాలను పరిశీలించి, మూసీ వెంట రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


Updated : 14 Dec 2023 11:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top