సీఎం రేవంత్ రెడ్డికి జ్వరం
X
సీఎం రేవంత్ రెడ్డికి జ్వరం వచ్చింది. గత మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి తీసుకోవడంతో పాటు పలు మందులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్కు కరోనా టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. కాగా ఆదివారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలోనూ రేవంత్ కొంత నీరసంగా కనిపించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరమే రేవంత్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఇక కలెక్టర్ల మీటింగ్లో రేవంత్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 6 గ్యారెంటీలు విజయవంతంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పని చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లేకుంటే టార్గెట్ రీచ్ కాలేమని చెప్పారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర సాయిలో అమలు చేసేది మాత్రం ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమేనని సీఎం అన్నారు. ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కబ్జాదారులు, అక్రమార్కులను ఉపేక్షించవద్దని, ఈ విషయంలో పోలీసులకు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అయితే అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురానంత వరకే అని స్పష్టం చేశారు.