రేపు రామయ్య సన్నిధికి రేవంత్ రెడ్డి
X
రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకోని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
ఇది ఇలా ఉంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రాస్ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల ముందే మంత్రి పొంగులేటితో పాటు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తెల్లం వెంకట్రావు. ఆయన భేటీ అయిన కొన్ని రోజులకే సీఎం భద్రాద్రి టూర్ ఫిక్స్ కావడంతో ఈ పర్యటనుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో గెలుపొందారు. అయితే మొత్తం పదిలో కేవలం భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే సీఎం భద్రాచలం పర్యటన నేపథ్యంలో ఆయన సమక్షంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరతారని వార్త జోరుగా సాగుతోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.