Home > తెలంగాణ > CM Revanth Reddy : సొంత నియోజకర్గంలో పర్యటించనున్న రేవంత్.. సీఎం అయ్యాక ఇదే తొలిసారి

CM Revanth Reddy : సొంత నియోజకర్గంలో పర్యటించనున్న రేవంత్.. సీఎం అయ్యాక ఇదే తొలిసారి

CM Revanth Reddy : సొంత నియోజకర్గంలో పర్యటించనున్న రేవంత్.. సీఎం అయ్యాక ఇదే తొలిసారి
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ అడుగుపెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో నియోజకవర్గానికి రూ. 4 వేల కోట్ల విలువైన 71 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో కొడంగల్‌కు మహర్ధశ పట్టనుందనే చెప్పవచ్చే. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేస్‌ గౌతమ్‌, కలెక్టర్‌ కోయ హర్ష, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పి.నారాయణ రెడ్డి, కొడంగల్‌ ఏరియా డెవలప్మెంట్‌ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.

కొడంగ‌ల్‌-నారాయ‌ణ‌పేట‌-మ‌క్తల్‌ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీరు ఇచ్చే నారాయ‌ణ‌పేట్‌-కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ఇవాళ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. రూ.2945.50 కోట్లు ఖర్చయ్యే ఈ పథకానికి ప‌రిపాల‌న ప‌ర‌మైన అనుమ‌తులు ఇస్తూ తెలంగాణ సర్కార్‌, ఈ నెల 8న జీవో జారీ చేసింది. దీంతోపాటు 360 కోట్లతో ప్రభుత్వ వెటర్నరీ కాలేజీకి, 344.5 కోట్లతో డబుల్‌ రోడ్లకు బ్రిడ్జి నిర్మాణాలకు, 224.50 కోట్లతో మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ కాలేజీలకు, కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 220 బెడ్లతో, టీచింగ్‌ కాలేజీకి, 213.20 కోట్లతో పంచాయతీరాజ్‌ రోడ్లకు, 40 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సీసీ రోడ్లకు, 30 కోట్లతో గవర్నమెంట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి, 27.86 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన బీటీ రోడ్లకు, 14.26 కోట్లతో బొంరాస్‌ పేట్‌, దౌల్తాబాద్‌ మండలాలలో జూనియర్‌ కళాశాల.. ఇలా పలు శాఖ‌ల ప‌రిధిలో వివిధ అభివృద్ధి ప‌నులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

దీంతో పాటు 25 కోట్లతో మైనార్టీ వెల్ఫేర్‌ పాఠశాలకు , 25 కోట్లతో మహాత్మ జ్యోతిరావు పూలే ట్రైబల్‌, బిసి పాఠశాల, కాలేజీకి, 11 కోట్లతో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు,6.8 కోట్లతో కొడంగల్‌ లో ఆర్‌ ఎండి అతిథిగృహంకు, 5 కోట్లతో కొడంగల్‌లో హాస్టల్‌ నిర్మాణానికి, వీటితోపాటు సబ్‌ స్టేషన్ల ఏర్పాటుకు, పాలిటెక్నిక్‌ హాస్టల్‌ కు సంబంధించిన వాటికి సుమారు 4,324.117 కోట్ల పనులకు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కోస్గి ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు 1500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated : 21 Feb 2024 3:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top