Home > తెలంగాణ > ఢిల్లీలో సీఎం రేవంత్.. కాసేపట్లో ప్రధానితో భేటీ

ఢిల్లీలో సీఎం రేవంత్.. కాసేపట్లో ప్రధానితో భేటీ

ఢిల్లీలో సీఎం రేవంత్.. కాసేపట్లో ప్రధానితో భేటీ
X

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం వారిరువురూ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మోడీని కలవనుండటం ఇదే తొలిసారి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న విభజన హామీలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీలో ప్రధానంగా పాలమూరు - రంగారెడ్డి, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల ప్రస్తావన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన నరేంద్ర మోడీతో సమావేశం ముగిసిన రేవంత్, భట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశముంది. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించనున్నట్లు సమాచారం. మరో మూడు నాలుగు నెలల్లో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12కు తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో ఇందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళికల గురించి రాష్ట్ర కాంగ్రెస్​ నాయకత్వం హైకమాండ్ పెద్దల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.




Updated : 26 Dec 2023 4:18 PM IST
Tags:    
Next Story
Share it
Top