నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి
X
నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హొదాలో తొలిసారి సొంత జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో ఆయన పాల్గొననున్నారు. సీఎం హోదాలో తొలిసభ కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.
లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయాలు జోరుందుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ అనుకుంటుంది. ఎన్నికల్లో భాగంగానే పార్లమెంట్ పరిధిలో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో వంశీచంద్ రెడ్డి పర్యటన పూర్తి చేసుకున్నారు. అటు జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రజా దీవెన సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సొంత జిల్లాకు ప్రజా దీవెన సభా వేదికగా రేవంత్ రెడ్డి పలు వరాలు ప్రకటనే చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.