తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీని ఆవిష్కరించిన సీఎం
Veerendra Prasad | 1 Feb 2024 8:01 PM IST
X
X
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సరం డైరీని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమవంతు కృషి చేయాలన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు కోడురు శ్రీనివాసరావు, జంగిటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ మధు మల్కేడికర్, కోశాధికారి సురేశ్ వేల్పుల, ఎక్జిక్యూటివ్ మెంబర్లు సోము సముద్రాల, కంచెరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Updated : 1 Feb 2024 8:01 PM IST
Tags: Telangana Secretariat Thursday Chief Minister A. Revanth Reddy 2024 year diary unveiled the diary Telangana Journalists Study Forum Secretariat on Thursday
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire