Home > తెలంగాణ > CM Revanth Reddy : లండన్ వేదికగా రేవంత్ వార్నింగ్.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే..

CM Revanth Reddy : లండన్ వేదికగా రేవంత్ వార్నింగ్.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే..

CM Revanth Reddy : లండన్ వేదికగా రేవంత్ వార్నింగ్.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే..
X

లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. వారికి ఇంకా అహంకారం పోలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. లండన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో చూసుకుందామని అంటున్నారని, ఆ సవాల్ స్వీకరిస్తున్నానని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతిలో పాతిపెట్టి ఆ పార్టీ గుర్తును కనిపించకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

పులి విశ్రాంతి తీసుకుంటోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, ఆ పులిని బంధించేందుకు తాము ఎదురుచూస్తున్నామని రేవంత్ అన్నారు. జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇంద్రవెళ్లి నుంచి తన యాత్ర మొదలుపెడతానని చెప్పారు. రానున్న మూడేళ్లలో మూసీ నదిని థేమ్స్ నదిలా అభివృద్ధి చేస్తామని రేవంత్ ప్రకటించారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని రేవంత్ స్పష్టం చేశారు.

రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు దానం నాగేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కు అంత అహంకారం పనికిరాదని అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం రేవంత్ గుర్తు పెట్టుకోవాలని దానం సూచించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాము ఒకేలా ఉన్నామని చెప్పారు. విదేశీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలే తప్ప.. రాష్ట్ర పరువు బజారుకీడిస్తే ఎలా? అని దానం ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూసుకుంటామని సవాల్ విసిరారు.




Updated : 20 Jan 2024 7:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top