ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. రేపు కీలక నిర్ణయం
X
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీలతో రేవంత్ చర్చించనున్నారు. గురువారం రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రేపు సోనియా గాంధీ పుట్టిన రోజున 64 ఎమ్మెల్యేల ప్రమాణి స్వీకారం, 11 మంది మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతుంది. దీంతో పాటు మిగిలిన ఆరుగురు మంత్రులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఆ ఆరుగురు మంత్రులు ఎవరవుతారనేనది ఆసక్తికరంగా మారింది.
మంత్రి పదవిపై వివేక్ వెంకటస్వామి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మదన్ మోహన్ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూనంనేని సాంబశివరావు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా అద్దంకి దయాకర్ రావు, ప్రొఫెసర్ కోదండరామ్ ల పేర్లు కూడా వినిపిస్తాయి. వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేంది రేపు తేలనుంది. మరోవైపు కాంగ్రెస్ ఒక్కసీటు గెలవని జిల్లాలకు కూడా ఎవరో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ సహా మరో రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ఆయా ప్రాంతాల్లోని సీనియర్ నేతలకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది.