Home > తెలంగాణ > నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల!

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల!

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల!
X

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో తెలంగాణ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దీంతో ఆశావహుల్లో ఎవరెవరికి టికెట్లు దక్కుతాయి, ఎవరికి మొండి చేయి ఎదురవుతుందనే ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులపై పార్టీ నాయకత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా తొలి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. దీంతో ఆయన ఎవరెవరి పేర్లు ప్రతిపాదించారు?, తొలి జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? అనేది ఈ రోజే తేలిపోనుంది. నేడు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుంది. 150 నుంచి 200 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల కానుంది. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు స్పష్టం చేశారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Updated : 7 March 2024 5:04 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top