Women's Day : మహిళల అభ్యున్నతికి పాటుపడతాం...రేవంత్ రెడ్డి
X
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని కోరారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడుతామన్నారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం పెరిగిందని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళలు ఆర్థిక తొడ్పాటుకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను అమలులోకి తెచ్చామని గుర్తు చేశారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంటుందన్న నమ్మకం తనకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.