Home > తెలంగాణ > CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్‌రెడ్డి  కీలక ఆదేశాలు
X

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీసు విభాగం అత్యంత పాధాన్యంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హాంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని పోత్సహించాలని సీఎం తెలిపారు. రద్దీ సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను నగర ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలన్నరు. సరిపడా సంఖ్యలో సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలని.. నగరంలో రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్‌లలో ఎల్బీనగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థపై ఆధారపడకుండా సిబ్బంది ఉండాలన్నారు.హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలన్నారు. కన్సలెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు. నెలకోసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించాలని సూచించారు.

Updated : 31 Jan 2024 6:13 PM IST
Tags:    
Next Story
Share it
Top