కనిపించిన నెలవంక.. ముస్లిం సోదరులకు సీఎం శుభాకాంక్షలు
X
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లీం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని సీఎం తెలిపారు.రంజాన్ మాస వేడుకలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన తెలిపారు.రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మతపెద్దలు ప్రకటించారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ సందడిగా మారింది. ముస్లింలు అత్యంత భక్తి, శ్రద్దలతో, నియమ, నిష్టలతో ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు కనీసం మంచినీళ్లు కాదు కదా కనీసం నోటిలోని లాలా జలాన్ని కూడా మింగకుండా భగవంతుడ్ని ప్రార్ధిస్తారు. రోజులో సూర్యోదయానికి ముందు సహర్ నుంచి సూర్యస్తమయం ఇఫ్తార్ వరకు రోజూకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.