Home > తెలంగాణ > Revanth Reddy : దేశాన్నే ఇల్లుగా చేసుకున్న నాయకుడు.. రేవంత్ ఆసక్తికర ట్వీట్

Revanth Reddy : దేశాన్నే ఇల్లుగా చేసుకున్న నాయకుడు.. రేవంత్ ఆసక్తికర ట్వీట్

Revanth Reddy : దేశాన్నే ఇల్లుగా చేసుకున్న నాయకుడు.. రేవంత్ ఆసక్తికర ట్వీట్
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారు. మణిపూర్ తౌబాల్ జిల్లాలోని ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అంతకుముందు రాహుల్ యాత్రపై రేవంత్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశాన్నే ఇల్లుగా.. జనాన్నే కుటుంబ సభ్యులుగా చేసుకున్న నాయకుడు అంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.

దేశాన్నే ఇల్లుగా…

జనాన్నే కుటుంబ సభ్యులుగా

చేసుకున్న నాయకుడు…

సామాన్యుడి సమరమై…

మధ్య తరగతి గమ్యమై…

పేదవాడి గమనమై…

ఆడబిడ్డల ధైర్యమై…

యువత ఆశల సారథై

రైతు కష్టం తీర్చే కర్షకుడై..

కదులుతోన్న మరో మహా యాత్ర

జై బోలో భారత్ న్యాయ్ యాత్ర అని రేవంత్ ట్వీట్ చేశారు. దీనికి ఓ వీడియోను జత చేశారు. కాగా రాహుల్ యాత్ర 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 67 రోజులపాటు సుమారు 6,713 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్ సభ స్థానాలను కవర్ చేసేలా యాత్ర సాగుతోంది. మార్చి 20న ముంబైలో జరిగే సభతో భారత్ జోడ్ న్యాయ్ యాత్ర ముగుస్తుంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా యాత్ర సాగుతుంది. భారత్ జోడో యాత్ర పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం బస్సుల్లో కొనసాగుతుంది. అయితే మధ్యమధ్యలో మాత్రం పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గతంలో రాహుల్ గాంధీ.. 2022లో రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టారు.


Updated : 14 Jan 2024 11:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top