Home > తెలంగాణ > CMD Prabhakar: సీఎం పిలిస్తే వెళ్లకుండా ఎందుకుంటాను?.. ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్

CMD Prabhakar: సీఎం పిలిస్తే వెళ్లకుండా ఎందుకుంటాను?.. ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్

CMD Prabhakar: సీఎం పిలిస్తే వెళ్లకుండా ఎందుకుంటాను?.. ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్
X

తెలంగాణలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షకు జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌ రావు గైర్హాజరైనట్లు వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. తనకు విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ ఎలాంటి ఆహ్వానం రాలేదన్నారు సీఎండీ ప్రభాకర్ రావు. ఈరోజు సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటానని, పిలిస్తే కచ్చితంగా సమావేశానికి హాజరవుతానన్నారు.

ఇదిలా ఉండగా.. . తెలంగాణలో విద్యుత్‌ శాఖకు రూ.85వేల కోట్ల రుపాయల అప్పులు ఉన్నట్లు గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. దీంతో విద్యుత్ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు రోజుల క్రితం తెలంగాణ ​ జెన్​ కో, ట్రాన్స్​ కో సీఎండీ పదవులకు రాజీనామా చేసిన ప్రభాకర్​ రావు రాజీనామాను ఆమోదించవద్దని, ఈ రోజు జరిగే సమీక్షకు ప్రభాకర్ రావునురప్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.


Updated : 8 Dec 2023 2:07 PM IST
Tags:    
Next Story
Share it
Top