Home > తెలంగాణ > తెలంగాణలో కొనసాగుతోన్న చలి తీవ్రత.. ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణలో కొనసాగుతోన్న చలి తీవ్రత.. ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణలో కొనసాగుతోన్న చలి తీవ్రత.. ఎల్లో అలర్ట్ జారీ..
X

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. గత రెండు రోజుల క్రితంతో పోలిస్టే నిన్న రాత్రి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. ఉదయం 8 అయితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఇక సాయంత్రమైతే ఇళ్ల తలుపులు మూసి ఇంట్లోనే ఉండే పరిస్థితి నెలకొంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 7.4 ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్లో 8, గిన్నెదరిలో 8, బేలలో 9.1, బజార్‌ హత్నూర్‌లో 9.3, నిర్మల్లో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జంట నగరాల్లో అత్యల్పంగా 15డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడురోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Updated : 25 Dec 2023 4:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top