Home > తెలంగాణ > డేంజర్లో భద్రాచలం.. చివరి ప్రమాద హెచ్చరిక జారీ

డేంజర్లో భద్రాచలం.. చివరి ప్రమాద హెచ్చరిక జారీ

డేంజర్లో భద్రాచలం.. చివరి ప్రమాద హెచ్చరిక జారీ
X

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో కలెక్టర్ ప్రియాంక చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలను జారీ చేయగా.. నీటిమట్టం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 14,15,708 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నీటిమట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే 49 పునరావాస కేంద్రాలకు 4,900 మందిని తరలించినట్టు అధికారులు తెలిపారు. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. భద్రాచలం సమీప మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం రహదారులు మూసివేశారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇక పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

కలెక్టర్‌ ప్రియాంక భద్రాచలంలోనే మకాం వేసి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఉదయం నాటికి నీటిమట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకుముందు ముత్తాపురంలో వరదలో చిక్కుకున్న 12మందిని గజఈతగాళ్లు రక్షించారు. అటు మంత్రి పువ్వాడ సైతం వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.


Updated : 28 July 2023 4:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top