Home > తెలంగాణ > Vande bharat express: తెలుగు రాష్ట్రాలకు మరికొన్ని వందేభారత్ రైళ్లు

Vande bharat express: తెలుగు రాష్ట్రాలకు మరికొన్ని వందేభారత్ రైళ్లు

Vande bharat express: తెలుగు రాష్ట్రాలకు మరికొన్ని వందేభారత్ రైళ్లు
X

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ ట్రైన్ లు అందుబాటులోకి రానున్నాయి. 11 రాష్ట్రాల్లో ప్రయాణించే 9 కొత్త వందేభారత్ ట్రైన్ లను ఆదివారం (సెప్టెంబర్ 23) ప్రారంభించనున్నారు. వీటిని ప్రధాని మోదీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ 9 రైళ్లలో కాచిగూడ-యశ్వంత్ పూర్, చెన్నై- విజయవాడ మధ్య నడిచేవి కూడా ఉన్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రూట్లలో మెరుగైన సదుపాయాలతో వస్తున్న ఈ రైళ్ల ప్రయాణికుల అవసరాలు తీర్చనున్నాయి. వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..

కాచిగూడ- యశ్వంత్ పూర్ రైలు బుధవారం మినహా మిగతా ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది. 610 కిలోమీటర్ల ఈ ప్రయాణాన్ని కేవలం 8:30 గంటల్లో చేరుకోవచ్చు. మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో ఆల్టింగ్ ఉంటుంది. కాగా ఈ రైలు చైర్ కార్ టికెట్ ధర రూ.1600, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.2915గా నిర్ణయించారు. కేటరింగ్ ఛార్జీలు అధనం. మధ్యాహ్నం 2:45 కు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి, రాత్రి 11: 15 గంటలకు కాచిగూడకు చేరుకుటుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం చైర్ కార్ టికెట్ ధర రూ.1540 ఉండగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కు రూ. 2865గా నిర్ణయించారు.

చైన్నై-విజయవాడ మార్గాల్లో మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు 517 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6:40 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలు మంగళవారం మినహా మిగతా ఆరురోజుల్లో ప్రయాణిస్తుంది. చెన్నై నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లలో ఆగుతుంది. చైర్ కార్ టికెట్ ధర రూ.1320 కాగా, ఎగ్జిక్యూటివ్ టికెట్ కు రూ.2540 ఉంది. విజయవాడ నుంచి మధ్యాహ్నం 3:20 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చైర్ కార్ టికెట్ కు రూ.1420, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు రూ.2630గా నిర్ణయించారు.

Updated : 23 Sept 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top