Home > తెలంగాణ > పదేళ్ల విరామం తర్వాత అసెంబ్లీకి ఎర్రజెండా..

పదేళ్ల విరామం తర్వాత అసెంబ్లీకి ఎర్రజెండా..

పదేళ్ల విరామం తర్వాత అసెంబ్లీకి ఎర్రజెండా..
X

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినా పొత్తుల పొత్తుల పుణ్యమా అప్పుడప్పుడూ ఉనికి చాటుకుంటున్నాయి. దాదాపు పదేళ్ల విరామం తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో కమ్యూనిస్టు ఎమ్మెల్యే అడుగుపెట్టనున్నారు. కొత్తగూడెం నుంచి సీసీఐ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓట్ల కౌంటింగ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు 58378 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్ రావుకు 36397, బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వ రావుకు 27606 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఎన్నికల పొత్తు కింద ఈ సీటును ఎర్రజెండాకు కేటాయింది. కూనంనేని 2009 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సున్నం రాజయ్య సీపీఎం తరుఫున గెలిచారు. 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టులెవరూ గెలవలేదు.


Updated : 3 Dec 2023 10:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top