Home > తెలంగాణ > సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఖరారు.. ఆ పార్టీ పోటీ ఎక్కడినుంచంటే..

సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఖరారు.. ఆ పార్టీ పోటీ ఎక్కడినుంచంటే..

సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఖరారు.. ఆ పార్టీ పోటీ ఎక్కడినుంచంటే..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఖాయమైంది. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. సీట్ల పంపకంలో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ స్థానంలో సీపీఐ గెలుపునకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందని చెప్పారు. చట్టసభల్లో లెఫ్ట్ పార్టీల ప్రాతినిధ్యం ఉండాలని కాంగ్రెస్ ఆశిస్తోందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ ఆఫీసుకు వెళ్లారు. ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతానికి కొత్తగూడెం సీటు, ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని సీపీఐకి రేవంత్‌ హామీ ఇచ్చారు. పెద్దమనసుతో సహకరించాలని కోరారు. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్‌ చెప్పారు.


Updated : 6 Nov 2023 12:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top