Home > తెలంగాణ > ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్.. చివరి నిమిషంలో తెరపైకి కొత్త పేరు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్.. చివరి నిమిషంలో తెరపైకి కొత్త పేరు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్.. చివరి నిమిషంలో తెరపైకి కొత్త పేరు..
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. చివరి నిమిషంలో కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లను ఖరారు చేసింది. దీంతో అద్దంకి దయాకర్కు మళ్లీ నిరాశే ఎదురైంది. బల్మూరి వెంకట్, అద్దంకిలకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఫైనల్ అయ్యారని.. నామినేషన్ వేయడమే లేట్ అని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అద్దందకి దయాకర్కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. అద్దంకి దయాకర్కు బదులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం ఇచ్చింది.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి టికెట్ ఆశించారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు ఆ టికెట్ త్యాగం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మందుల సామేలుకు టికెట్ ఇవ్వగా ఆయన ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి కూడా ఆయనకు అవకాశం దక్కలేదు. కాగా గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు స్థానాల భర్తీ కోసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.





Updated : 17 Jan 2024 11:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top