తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Krishna | 14 Feb 2024 4:48 PM IST
X
X
రాజసభ్య అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి సీనియర్ నేత రేణుకా చౌదరీ, అనిల్ కుమార్ యాదవ్ లను హైకమాండ్ ఎంపిక చేసింది. కేంద్ర మాజీ మంత్రి అయిన రేణుక చౌదరీ ఖమ్మం లోక్ సభ సీటు ఆశిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముషీరాబాద్ టికెట్ ఆశించారు. అయితే పార్టీ ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ కు ఆ స్థానాన్ని కేటాయించింది. ఈ క్రమంలో వారిని రాజ్యసభకు పంపనుంది. కర్నాటక నుంచి అజయ్ మాకెన్, జీసీ చంద్ర శేఖర్, సయ్యద్ నసీర్ హుస్సేన్ లను ఎంపిక చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్కు అవకాశం కల్పించింది.
Updated : 14 Feb 2024 4:48 PM IST
Tags: congress rajya sabha candidates telangana rajya sabha candidates telangana congress rajyasabha candidates renuka chowdhury anil kumar yadav telangana congress cm revanth reddy rajya sabha elections telugu news telugu updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire