తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ కీలక పదవి..
X
తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ కీలక పదవి కట్టబెట్టింది. మల్లన్నను కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్గా నియమించింది. ఈ మేరకు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ప్రకటించారు. కాంగ్రెస్లో చేరిన గంటల వ్యవధిలోనే మల్లన్నకు కాంగ్రెస్ కీలక పదవి అప్పగించింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం నిర్వహిస్తున్న మల్లన్న.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.
కాగా గురువారం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఆయన హస్తం కండువా కప్పుకన్నారు. ముందుగా మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేయాలని మల్లన్న భావించారు. అయితే కాంగ్రెస్ ఆ టికెట్ ను వజ్రేష్ యాదవ్కు ఇచ్చింది. దీనిపై మల్లన్న అసంతృప్తి బహిరంగాంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో ఆయన హస్తం గూటికి చేరారు.