Home > తెలంగాణ > నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్.. ముందంజలో కాంగ్రెస్

నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్.. ముందంజలో కాంగ్రెస్

నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్.. ముందంజలో కాంగ్రెస్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్​ బ్యాలెట్లు సహా ఈవీఎం ఫలితాల్లోనూ కాంగ్రెస్​ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాలను బట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అర్థమవుతుండటంతో.. అప్పుడే గాంధీ భవన్‌లో సంబరాలు మొదలయ్యాయి. జిల్లాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు రెడీగా ఉంచుకున్న బాణసంచాను కాల్చేందుకు సిద్ధమవుతున్నారు. సంబరాలు ఓ రేంజ్ లో చేసుకోవాలని ముందే ఫిక్స్ అయ్యారు. అందువల్ల ఈ సాయంత్రం కాంగ్రెస్ సంబరాలు భారీగా జరిగేలా ఉన్నాయి. ఐతే.. ప్రస్తుతం ఉన్న ఫలితాలన్నీ ఆధిక్యాలే. అప్పుడే తొందర వద్దని కొందరు అంటున్నారు.

ఫలితాల సరళిని చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తిని వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలకు బాగా నచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాదు.. ఆ పార్టీ ఈ పథకాలను తప్పక అమలు చెయ్యగలదు అని ప్రజలు బాగా నమ్మినట్లు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఇక తెరపడినట్లే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఐతే.. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే, ఆ తర్వాత జరిగే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Updated : 3 Dec 2023 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top