Home > తెలంగాణ > ముగిసిన కాంగ్రెస్ సీఈసీ భేటీ.. త్వరలో సెకండ్ లిస్ట్ రిలీజ్..!

ముగిసిన కాంగ్రెస్ సీఈసీ భేటీ.. త్వరలో సెకండ్ లిస్ట్ రిలీజ్..!

ముగిసిన కాంగ్రెస్ సీఈసీ భేటీ.. త్వరలో సెకండ్ లిస్ట్ రిలీజ్..!
X

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఢిల్లీలో జరిగిన భేటీలో అభ్యర్థుల ఎంపికపై దాదాపు 5 గంటల పాటు చర్చించారు. పార్టీ సెకండ్ లిస్టులో చోటు దక్కే అభ్యర్థుల పేర్లపై తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించే స్థానాలపైనా కమిటీ సభ్యులు చర్చించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సోనియా గాంధీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్, భట్టి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నందున భేటీకి హాజరు కాలేదు. తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వామపక్ష పార్టీలకు ఇచ్చే 4 స్థానాలు మినహా మిగిలిన 60 సీట్లలో బరిలో నిలిపే అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ సీఈసీ మీటింగ్ ముగిసిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో పార్టీ సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశముంది.

Updated : 25 Oct 2023 5:22 PM IST
Tags:    
Next Story
Share it
Top