Home > తెలంగాణ > రేవంతే సీఎం.. నిర్ణయించిన రాహుల్.. కాసేపట్లో ప్రకటన

రేవంతే సీఎం.. నిర్ణయించిన రాహుల్.. కాసేపట్లో ప్రకటన

రేవంతే సీఎం.. నిర్ణయించిన రాహుల్.. కాసేపట్లో ప్రకటన
X

తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికే అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. సీఎం, డిప్యూటీ సీఎంల ఎంపికపై ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన చర్చలు కాసేటి కిందట ముగిశాయి. పార్టీని విజయానికి కృషి చేసిన రేవంత్ రెడ్డినే సీఎం చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. సమావేశంలో సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావ్ థాకరే కూడా పాల్గొన్నారు. 64 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను డీకే అధిష్టానానికి వివరించారు. ఉత్తమ్ కుమార్, మల్లు భట్టి విక్రమార్కల పేర్లను కూడా పరిశీలించి రేవంత్ పేరును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. డీకే శివకుమార్ మరి కొద్ది గంటల్లో సీల్డ్ కవర్‌తో హైదరాబాద్ చేరుకుని సీఎల్పీ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లను ప్రకటించనున్నారు. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 7న రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

Updated : 5 Dec 2023 4:47 PM IST
Tags:    
Next Story
Share it
Top