ఢిల్లీకి జగ్గారెడ్డి.. రాహుల్తో ప్రత్యేక సమావేశం
Krishna | 10 Jan 2024 1:24 PM IST
X
X
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ఆయన సమావేశం కానున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గారెడ్డి మొన్నటి ఎన్నికల్లో సంగారెడ్డి నంచి పోటీ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ పదవి లేదా పీసీసీ ప్రెసిడెంట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా మెదక్ ఎంపీగా జగ్గారెడ్డి కూతురు లేదా సతీమణి పోటీ చేస్తాని ప్రచారం జరగుతోంది. అయితే అధిష్ఠానం ఆయనకు ఏ బాధ్యతలు అప్పగిస్తుందో వేచి చూడాలి
Updated : 10 Jan 2024 1:24 PM IST
Tags: jaggareddy congress ex mla sangareddy ex mla jaggareddy delhi cm revanth reddy bhatti vikramarka congress govt telangana govt rahul gandhi mallikarjuna kharge sonia gandhi telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire