Congress Candidate First List : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ.. ఆ రోజే ప్రకటన..!
X
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కారును ఢీకొట్టేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. కాంగ్రెస్ ఈ సారి సరికొత్త పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక చేపడుతోంది.ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన హస్తం పార్టీ.. ఇంకా వాటిని వడబోసే పనిలోనే తలమునకలైంది. ఇప్పటికే తొలిజాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపినట్లు తెలుస్తోంది.(Congress Candidate First List ) దీంతో ఫస్ట్ లిస్ట్
ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశం తర్వాత మొదటి జాబితా రిలీజ్పై స్పష్టత రానుంది. ఈ నెల 15న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కానుందని ఆ పార్టీ వర్గా సమాచారం. సుమారు 70 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది (Congress Candidate First List Ready ). 70కి పైగా స్థానాల్లో సింగిల్ పేరును, మరో 30 స్థానాల్లో రెండేసి పేర్లను సీఈసీకి పంపినట్లు సమాచారం. వీటిని సీఈసీ పరిశీలించి ఆమోదదముద్ర వేయనుంది. రెండు పేర్లున్న నియోజకవర్గాలపై స్క్రీనింగ్ కమిటీకి పలు మార్గదర్శకాలు సూచించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమకు బెర్తులు దక్కుతాయో లేదో అని ఆశవాహులు వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తే ప్రచారానికి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అయితే దరఖాస్తులు పెద్దఎత్తున రావడం, వలస నేతలకు టికెట్లు, బీసీ టికెట్ల అంశం వంటివి అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేస్తున్నాయని అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఫస్ట్ లిస్ట్ రానుండడంతో ఎవరికి చేయి, ఎవరికి మొండిచెయి అన్నది చూడాలి.