Home > తెలంగాణ > CPM- CPI: పొత్తు కుదిరింది.. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు

CPM- CPI: పొత్తు కుదిరింది.. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు

CPM- CPI: పొత్తు కుదిరింది.. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు
X

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. సీపీఎం, సీపీఐ పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆయా పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సీపీఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ నియోజక వర్గ టికెట్లు ఖరారు చేయగా.. సీపీఐ పార్టీకి కొత్తగూడెం, మునుగోడు సీట్లను కేటాయించారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ కన్ఫార్మ్ అయింది. పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. పొదెం వీరయ్యను పినపాకకు పాంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. భట్టి విక్రమార్క ద్వారా సీపీఎం, సీపీఐ బలాబలాలపై కాంగ్రెస్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో లెఫ్ట్ పార్టీల ప్రభావం కలిసి వస్తుందనే రిపోర్ట్ రాగా.. వారితో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఆదివారం (అక్టోబర్ 8) కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగినా.. ఇంకా కొన్ని స్థానాల అభ్యర్ధుల ఎంపిక పూర్తి కాలేదు. ఆ కారణంగానే కాంగ్రెస్ తొది జాబితా ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో మరోసారి భేటీ కావాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించుకుంది. ఈలెక్కన చూసుకుంటే అక్టోబర్ 20వ తేదీ తర్వాతే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పెద్దలు మల్లిఖార్జన ఖర్గే, వేణుగోపాల్ తో లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా, నారాయణ చర్చలు జరిపారు. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలనే ప్రతిపాదనను ఓకే చెప్పారు.

Updated : 9 Oct 2023 5:32 PM IST
Tags:    
Next Story
Share it
Top