Breaking News: ఆరు గ్యారంటీల దరఖాస్తులకు 2 రోజులు బ్రేక్..!
X
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పనిలో పడింది. ఆ పథకాల అమలుకు ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తులు సేకరిస్తుంది. ఈ క్రమంలో 2 రోజుల పాటు దరఖాస్తు ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. రేపు ఆదివారం (డిసెంబన్ 31), సోమవారం (జనవరి 1) కావడంతో రెండు రోజుల పాటు.. దరఖాస్తులకు అధికారిక సెలవు ప్రకటించింది. తిరిగి జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ మొదట 10 రోజుల గడువు అని ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఈ రెండు రోజుల సెలవుతో.. గడువు 8 రోజులే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతుందా లేదా చూడాలి.
తొలి రోజున వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులు:
* గ్రామాల నుంచి: 2,88,711
* పట్టణాల నుంచి: 4,57,703
* మొత్తం: 7,46,414
రెండో రోజు వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులు:
* గ్రామాల నుంచి: 3,23,862
* పట్టణాల నుంచి: 4,59,000
* మొత్తం: 8,12,862
రెండు రోజుల్లో వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులు:
* గ్రామాల నుంచి: 6,12,573
* పట్టణాల నుంచి: 9,46,703
* మొత్తం: 15,59,276