Home > తెలంగాణ > ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
X

విద్యుత్ రంగానికి సంబంధించి మూడు అంశాలపై పూర్తి స్థాయిలో జ్యూడిషియల్ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో మాట్లాడారు. ఈ క్రమంలో విద్యుత్ రంగంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని జగదీష్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా అని తెలిపారు. ఆనాటి ప్రభుత్వం సభ ముందు ఏనాడూ వాస్తవాలు ఉంచలేదన్నారు. కరెంట్ అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందన్నారు. ఉద్యమంలో పని చేసిన తెలంగాణ విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు. విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తే సభ నుంచి మార్షల్స్‌తో గెంటించారన్నారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కోనుగోళ్ల కుంభకోణంపై, భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి పవర్ ప్లాంట్ల అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తామన్నారు.

ఛత్తీస్ గఢ్ తో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ లో వేల కోట్ల దోపిడీ జరిగిందని, జ్యూడీషియల్ ఎంక్వయిరీలో రెండో అంశంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ ను చేర్చుతున్నామని సీఎం తెలిపారు. మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సమాధానంగా ... సీఎం చెప్పిన మూడు అంశాలతో పాటు కోమటిరెడ్డి ఆరోపణలపైనా విచారణ జరిపించాలన్నారు బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి. న్యాయ విచారణను తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

Updated : 21 Dec 2023 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top