Home > తెలంగాణ > Telangana Congress: తుమ్మల, పొంగులేటి టికెట్లపై స్పష్టత.. ఆ స్థానాల నుంచి పోటీ

Telangana Congress: తుమ్మల, పొంగులేటి టికెట్లపై స్పష్టత.. ఆ స్థానాల నుంచి పోటీ

Telangana Congress: తుమ్మల, పొంగులేటి టికెట్లపై స్పష్టత.. ఆ స్థానాల నుంచి పోటీ
X

కాంగ్రెస్ పార్టీ తుది జాబితాపై సస్పెన్స్ ఉన్న వేళ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. అధిష్టానం పిలుపు మేరకు ఇవాళ ఢిల్లీ వెళ్లిన తుమ్మల, పొంగులేటి.. రాహుల్ తో భేటీ అయి, తమ టికెట్ల విషయంపై క్లారిటీ తెచ్చుకున్నారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా, తుమ్మల, పొంగులేటి టికెట్లపై ఈ భేటీ ద్వారా స్పష్టత వచ్చింది. పాలేరు బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలుస్తుండగా.. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేయనున్నారు.

Updated : 14 Oct 2023 3:25 PM IST
Tags:    
Next Story
Share it
Top