కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ వ్యూహాలు అమలు చేస్తాం: రేవంత్
X
ఢిల్లీలో జరిగిన టీకాంగ్రెస్ నేతల స్ట్రాటజీ మీటింగ్ లో.. తెలంగాణలో కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణపై చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణను ప్రారంభించిందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని అధిష్ఠానం సూచించినట్లు రేవంత్ వెల్లడించారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ వ్యూహాలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
ఇందులో బీఆర్ఎస్, బీజేపీ అధికార దుర్వినియోగాలను ప్రజలకు చేరేవేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అవినీతి మయం అయిందని వివరించాడు. అవినీతి ఆకాశమంత ఎత్తు పెరిగిందని, అభివృద్ధి పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. కాంగ్సెస్ నేతలంతా కలిసి బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకు పనిచేస్తామని రేవంత్ తెలిపారు.