Home > తెలంగాణ > విజయం దిశగా కాంగ్రెస్.. పక్కా ప్లాన్తో రెడీగా డీకే శివకుమార్

విజయం దిశగా కాంగ్రెస్.. పక్కా ప్లాన్తో రెడీగా డీకే శివకుమార్

విజయం దిశగా కాంగ్రెస్.. పక్కా ప్లాన్తో రెడీగా డీకే శివకుమార్
X

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సుమారు 65 స్థానాల్లో హస్తం పార్టీ హవా చూపిస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్ స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు చేజారకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఫలితాల మానిటరింగ్ ను కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అప్పగించి. దీంతో శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఫలితాల సరళిని పరిశీలించి.. భవిష్యత్ ప్రణాళికపై వ్యూహాలు రచిస్తున్నారు.

బీఆర్ఎస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం తాజ్ కృష్ణలో సుమారు 100 రూమ్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. తాజ్ కృష్ణకు వచ్చిన అభ్యర్థులను బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించే అవకాశం ఉంది. దీని కోసం తాజ్ కృష్ణలో బస్సులను సిద్ధంగా ఉంచారు. దీంతో తెలంగాణలో క్యాంప్ రాజకీయాలకు తెరలేచినట్లు తెలుస్తోంది.

Updated : 3 Dec 2023 11:23 AM IST
Tags:    
Next Story
Share it
Top