Home > తెలంగాణ > నాగార్జున సాగర్ రచ్చ, ఓటమి భయంతోనే.. కోమటిరెడ్డి

నాగార్జున సాగర్ రచ్చ, ఓటమి భయంతోనే.. కోమటిరెడ్డి

నాగార్జున సాగర్ రచ్చ, ఓటమి భయంతోనే.. కోమటిరెడ్డి
X

నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు మధ్య జరిగిన ఘర్షణపై తెలంగాణ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్ రోజున గొడవను ఉద్దేశపూర్వకంగా రేపెట్టారని నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఇలాంటి డ్రామాలను నమ్మకుండా అసలైన అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటేయాన్నారు.

‘‘సాగర్ డ్యాంపై వివాదాన్ని పోలింగ్ రోజు తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కుట్రల పన్నులుతున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. పోలింగ్ రోజు తెలంగాణ సెంటిమెంట్ తో కెసిఆర్ లబ్ధి పొందేందుకు కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఇన్ని రోజులు లేనిది పోలింగ్ రోజే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే ఓటమి భయంతో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును వాడుకునేందుకు డ్రామాలు ఆడుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ పోరాట యోధులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను అర్థం చేసుకోవాలి. ఈ డ్రామాలను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి’’ అని కోరారు. కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు గెలిచి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 2009లో చేసిన దీక్షల ఫోటోలు కూడా కేసిఆర్ ఇప్పుడు పత్రికల్లో యాడ్స్‌లో వేయించుకున్నాడని మండిపడ్డారు.

Updated : 30 Nov 2023 10:46 AM IST
Tags:    
Next Story
Share it
Top