Home > తెలంగాణ > షర్మిల ఎవరో తెలియదు, అలాంటి మొనగాడు పుట్టలేదు.. రేణుక

షర్మిల ఎవరో తెలియదు, అలాంటి మొనగాడు పుట్టలేదు.. రేణుక

షర్మిల ఎవరో తెలియదు, అలాంటి మొనగాడు పుట్టలేదు.. రేణుక
X

ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలోనూ, కేంద్రంలో గెలుపు తమ పార్టీదేనని కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఓటమి భయంతో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ బీజేపీ, బీఆర్ఎస్ రెండూ చేతులు కలిపాయని ఆరోపించారు. ఆమె ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించారు. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ గెలుపుకు ఢోకా ఉండదన్నారు.

వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం, ఖమ్మం నుంచి పోటీపై మాట్లాడుతూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘షర్మిల ఎవరో నాకు తెలియదు. ఆమెది ఆంధ్రా. ఆమె అన్న అక్కడే ఉన్నాడు. తెలంగాణలో పార్టీ పెట్టిన వాళ్లు ఇంత రాష్ర్టాన్ని వదిలిపెట్టి ఖమ్మంలోనే ఎందుకు ఉన్నారో చెప్పాలి?’’ అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఖమ్మం నుంచి తనను బయటికి పంపే పంపే మొనగాడు ఇంకా పుట్టలేదని ఘాటుగా బదులిచారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల జట్టు కట్టాయని, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని మార్చడమే దీనికి ఉదాహరణ అని రేణుక అన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్‌కు అనుకూలంగా మసలుకుంటారనే ఆయనకు పగ్గాలు అప్పగించారని ఆరోపించారు.


Updated : 9 July 2023 5:02 PM IST
Tags:    
Next Story
Share it
Top