Home > తెలంగాణ > బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కీలక నేత.. కండువా కప్పిన కేటీఆర్

బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కీలక నేత.. కండువా కప్పిన కేటీఆర్

బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కీలక నేత.. కండువా కప్పిన కేటీఆర్
X

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. భద్రాచలం కాంగ్రెస్ నేత తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని సెటైర్ వేశారు.





బీఆర్ఎస్లో వెంకట్రావ్ భవిష్యత్కు తాను భరోసా ఇస్తున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోటి రతనాల వీణ.. ఇవాళ కోటి ఎకరాల మాగణిగా మారిందన్నారు. కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తమ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు. మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకుని కేంద్రం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసకొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌ఘడ్లో పోడు భూములకు పట్టాలిచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో 4లక్షల 50వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లుగా అక్కడ ఇస్తారా అని నిలదీశారు. తెలంగాణలో రైతులకు అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అమలుచేస్తున్నాయా అని అడిగారు.

కాగా తెల్లం వెంకట్రావ్ జులైలో పొంగులేటి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే ఆయన తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. తెల్లం 2014లో మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పొంగులేటి వెంట ఉంటున్నారు. తాజాగా ఆయనకు షాకిస్తూ బీఆర్ఎస్లో చేరారు.


Updated : 17 Aug 2023 3:21 PM IST
Tags:    
Next Story
Share it
Top