‘ప్రొటెం స్పీకర్’ వివాదంపై స్పందించిన ఉత్తమ్
X
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రమాణ స్వీకారం చేయకపోవడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిణామం ఇదివరకెన్నడూ చోటుచేసుకోలేదు. అక్బరుద్దీన్ హిందువులకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేశాడని, అలాంటి మనిషి ద్వారా ప్రమాణం చేయడం తమకిష్టం లేదని బీజేపీ సభ్యులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేకపోవడంతో మజ్లిస్‌ను మచ్చిక చేసుకుంటోందని విమర్శిస్తున్నారు. అయితే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తప్పేముందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అందర్నీ కలుపుకుపోవాలనే ఆయనను ప్రొటెంగా తీసుకున్నామన్నారు.
‘‘దీని వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశమూ లేదు. అంతా రాజ్యాంగబద్ధంగానే సాగింది’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సభలో సీనియర్ సభ్యుడు ప్రొటెమ్ స్పీకర్‌గా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోందని, సీనియర్‌నైన తను మంత్రిని కావడం వల్ల ప్రొటెంగా ఉండలేకపోయానన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెమ్ స్పీకర్ కావడానికి రాజకీయాలతో సంబంధం లేదని, అన్ని కులమతాల ప్రజలు కలుపుకుపోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పారు.